జంగాలపల్లి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం.
భద్రాచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నామని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం నాడు మండల పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనుల్లో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు మండల నాయకులు సమన్వయంతో కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పనులకు శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించే కృషి చేస్తానని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 48











