విద్యావ్యవస్థను మెరుగుపర్చేందుకు సీవీకే కృషి అమోఘం

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

విద్యావ్యవస్థను మెరుగుపర్చేందుకు సీవీకే కృషి అమోఘం

ఆయన ఆశయ సాధనకు పిలుపు…భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం

చర్ల, నేటిసూర్య న్యూస్:  విద్యావ్యవస్థను మెరుగుపర్చేందుకు చింతల చెరువు కృష్ణా రావు (సీవీకే) కృషి అమోఘమని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కొనియాడారు. గురువారం స్థానిక శైలజ విహార్ లో ప్రముఖ రాజకీయ నాయకులు, సామాజికవేత్త, కళా తపస్వి సివికె రావు మూడవ వర్ధంతి సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రవాణా వ్యవస్థ సరిగ్గా లేక సాగు, తాగు నీరు విద్యా వైద్యం అందని ద్రాక్షాలా ఉన్న భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో సీవీకే చేసిన సేవలు చిరస్మరణీయమైనవని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ… వారి నిరంతరమైన సేవల వల్ల ఏజెన్సీ ప్రాంతం దినదినాభివృద్ధి జరిగిందన్నారు. సమృద్ధిగా సాగు నీరు ఉండి ఈ ప్రాంతంలో భూములు బిల్లుగా మారుతూ ఉండడానికి గ్రహించిన సివికే రావు ఆనాటి ముఖ్యమంత్రి జలగంగల్ రావు సహకారంతో తాళి పేరు వాగుపై మధ్యతర తాలిపేరు ప్రాజెక్టు నిర్మాణానికి తనదైన శైలిలో కృషి చేశారని ముఖ్య అతిథులు ప్రశంసించారు. యాంత్రిక జీవితంలో తాతది, తండ్రిది జనన మరణ దినోత్సవాలను చేస్తూ ఆయా రోజులలో నిరుపేద విద్యార్థులకు సివికే రావు కుటుంబ సభ్యులు సీవీ. రమణ హైకోర్టు అడ్వకేట్ సీహెచ్. సతీష్ కుమార్ లు సహకరించడం అభినందనీయమని వక్తలు ప్రశంసించారు. సివికే రావు మూడో వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల లో విద్యనభ్యసిస్తున్న 40మంది విద్యార్థినిలకు ప్లేట్లు గ్లాసులు వితరణ చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శులు నల్లపు దుర్గాప్రసాద్ , నాగ సీతారాములు, పిఎసిఎస్ చైర్మన్ పరిచూర్ రవికుమార్, మాజీ సర్పంచ్ కాపుల కృష్ణా అర్జునరావు, కొత్తపల్లి ఆంజనేయులు ,పోలిన లంక రాజు, ఎంపీడీవో కె .ఈదయ్య, చింతూరి వెంకట్రావు, కొసరాజు రాజా, బండారు రామకృష్ణ, తడికల లాలయ్యా దొడ్డి తాతారావు, దొడ్డ ప్రభుదాస్, హెచ్ జి వి గిరిప్రసాద్, వర్మ రాజు పెద్దాడ ఆశాలత, బండి చిన్న రాము, భూపతి రాజు శ్రీరామరాజు, విజయ భాస్కర్ రెడ్డి పెద్ద ఎత్తున నాయకులు పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్