ఆర్ అండ్ బి రోడ్లో నాట్లు
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన.
బూర్గంపాడు, నేటిసూర్య న్యూస్: వర్షా కాలం వస్తే చాలు రోడ్లు వాహనాలు, పాద చారులు నడిచేందుకు వీలుగా ఉండకుండా పశువులతో దుక్కులు దున్నిన పొలాలుగా మారిపోతాయి. ఇదీ భరించలేని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు తోటి కార్యకర్తలు, స్థానిక ప్రజలతో కలసి నిరసన చేపట్టేందుకు పిలుపునిచ్చారు. ఇంకేముంది శనివారం నాడు ఆర్ అండ్ బి రోడ్ పైనే ఏకంగా నాట్లు వేసే కార్యక్రమం సృష్టించి వినూత్న రీతిలో నిరసనకు తెరలేపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డుపై దారుణంగా గోతులు ఉండటం వల్ల వాహనదారులకు, ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ గుంతల్లో కిందపడ్డ సంఘటనలు కోకొల్లలు. అందుకు నిరసనగా ఇలా నాటు వేసి నిరసన వ్యక్తం చేశారు. గత పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి ఆ రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. పలు మార్లు అధికారుల దృష్టి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.పలు సార్లు ఆందోళనలు చేయడం వల్ల అధికారులు భద్రాచలం నుండి మట్టి తీసుకొచ్చి తూ.తు. మంత్రంగా ఆ గోతుల్లో పోసి చేతులు దులుపుకున్నారు. ఫలితంగా ఆ రోడ్డు కాస్తా బురదమయమై పోవడంతో ఆ బురదలో ప్రజలు జారీపడి పోతున్న దుస్థితి నెలకొంది. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని ప్రజల ప్రాణాల్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఏ రాత్రిపూట ఏ లారీయో ఏ బస్సు కిందపడే పరిస్థితి దాపురించిందని నెలకొందన్నారు.ఈ రోడ్డుకి మరమ్మతులు చేయాలని, బీటీ రోడ్డు వేయాలని అధికారులకు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజన, షేక్ అబెదా, కౌలూరి నాగమణి, సరూప, ఐశ్వర్య, బోళ్ళ ధర్మ, నరసింహారావు, జంపన్న, తదితరులు పాల్గొన్నారు.











