అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

బూర్గంపాడు, నేటిసూర్య న్యూస్: బూర్గంపాడు మండలం ,సారపాక గాంధీనగర్ శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఎంతో ఘనంగా కన్నుల పండుగ, అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు.ఉదయం 9 గంటలకు గోపూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటిసి పిఎస్పీడీ మేనేజర్ రామారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు , శ్రీకృష్ణతత్వం గురించి భక్తులకు తెలియజేశారు, భగవద్గీత శ్లోకాలను చిన్నారులు ఎంతో మధురంగా ఆలపించారు. భగవద్గీత శ్లోకాలు ఆలపించిన చిన్నారులకు ఐటిసి మేనేజర్ రామారావు బహుమతులను అందజేశారు ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులో భగవద్గీత శ్లోకాలు ఎంతో చక్కగా ఆలపించారని వారిని, వారికి భగవద్గీత శ్లోకాలు నేర్పిన గురువు కళ్యాణి నీ అభినందించారు , ఈ సందర్భంగా మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిం చారు,మధ్యాహ్నం మూడు గంటలకు మందిరం వద్ద ఉట్టి ఉత్సవం నిర్వహించి శ్రీకృష్ణ సేవా సమితి మహిళా బృందం చే కోలాటం ఉత్సవంతో స్వామివారి ఊరేగింపు ముత్యాలమ్మపేట ముత్యాలమ్మ గుడి వరకు కొనసాగి సారపాక సెంటర్లో మరియు ముత్యాలమ్మ గుడి వద్ద ఉట్టి ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకృష్ణ సేవా సమితి సభ్యులందరూ ఆనందోహంతో పాల్గొని యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గల్లా నాగభూషయ్య, బొడ్డు నరసింహారావు, బండారు కృష్ణయ్య, పెళ్లి గోపయ్య, పిడుగు కొండలరావు , బండారు సత్యనారాయణ, గల్లా రామకృష్ణ ,గంగినేని వీరాంజనేయులు ,సాదా లక్ష్మీనారాయణ ,వలసపల్లి కృష్ణారావు, కానూరి ఈశ్వరరావు ,గుండు బోయిన శ్రీనివాసరావు ,వై కొండలరావు, శ్రీకృష్ణ మందిర్ సేవ సమితి మహిళా సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్