భావి పౌరులకు ఊతమిద్దాం..
వారిలో శక్తిని నింపుదాం…
రాగి జావ తాగనిద్దాం.
జవ్వాది మురళీకృష్ణ చాటిన ఔదార్యం.
నేటిసూర్య ప్రతినిధి: నేటి బాలలే భావి పౌరులని వారికి బలమైన ఆహారాన్ని అందజేసి శక్తిని నింపుదాం… రాగి జావ తాగనిద్దాం… అనే కాన్సెప్ట్ తో మరో సారీ ముందుకొచ్చారు సీనియర్ జర్నలిస్ట్, కొమరం భీం విద్యార్థి నిలయ కమిటీ ఉపాధ్యక్షులు జవ్వాది మురళీకృష్ణ. ఇటీవలప్రభుత్వ వైద్యులు కొమరం భీం విద్యార్థి నిలయం విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్నారని నిర్ధారించిన విషయం విధితమే. వారికి బలమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఇకపై ప్రతిరోజూ ఉదయం విద్యార్ధులకు రాగి జావ ఇద్దామని ఫిక్స్ అయ్యారు. నెలకు సరిపడా రాగి పిండి సొంతంగా కొనుగోలు చేసి బుధవారం నాడు నిలయ ప్రముఖ్ సోదరి గొంది ప్రసన్న కుమారికి అందచేశారు. ఏది ఏమైనా ఇలా విద్యార్థుల పట్ల తీసుకుంటున్న శ్రద్ధ పలువురికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పకతప్పదు.
Post Views: 105











