క్రాంతి పురం లో ఆరోగ్య శిబిరం. —— పర్యవేక్షించిన మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హారిక

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

చర్ల, నేటిసూర్య న్యూస్: చర్ల మండల పరిధిలోని కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మలేరియా ప్రభావిత ప్రాంతమైన క్రాంతిపురంలో బుధవారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హారిక పర్యవేక్షణలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 32మంది బాధితులకు వైద్య చికిత్సలు అందజేసిన మందులు పంపిణీ చేశారు. జ్వరాలతో బాధపడుతోన్న ఇద్దరికి రక్త పరీక్షలు చేసి సాధారణ జ్వరంగా నిర్ధారించి వైద్య చికిత్సలు చేశారు. అనంతరం గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి సీజనల్ వ్యాధుల మీద ప్రజలకు అవగాహన కలిగించారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, నీటి నిల్వలు వారానికి రెండు సార్లు మార్చుకోవాలని, ఈగలు వాలకుండా ఆహార పదార్థాల మీద మూతలు పెట్టాలని, ఆహారం వేడివేడిగా మాత్రమే తినాలని, త్రాగు నీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాతే త్రాగాలని పలు సూచనలు చేశారు. జ్వరం వచ్చినట్లయితే అశ్రద్ధ చేయకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కి వెంటనే వచ్చి వైద్యం తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు..ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ రాంప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ ధర్మారావు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్