చర్ల, నేటిసూర్య న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండల కేంద్రంలో జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నీళ్లను ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకు సాగునీరు ఇవ్వడం సరైనదే కానీ భద్రాది కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల రైతాంగానికి సాగునీటి ఇవ్వకపోవడం మాత్రం దుర్మార్గమని హితవు పలికారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని భద్రాద్రి జిల్లాకు సాగునీరు అందించాల్సిందిగా రైతుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిన అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డుల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
