సాగు నీటి కోసం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి ….

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

సాగు నీటి కోసం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి

ఆరు గ్యారంటీల అమలు ఎప్పుడా అని నిలదీసిన బీఆర్ఎస్ పార్టీ.

బూర్గంపాడు,నేటిసూర్య న్యూస్:  సాగు నీరుతో పాటు ఆరు గ్యారంటీల అమలు వెనువెంటనే జరగాలని బూర్గంపాడు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపి రెడ్డి రమణ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ముట్టడికి పాల్పడ్డామన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… స్వతంత్ర కాలం నుండీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా సాగు నీరు ప్రాజెక్టులు లేవు, కానీ తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం అమ్మగారిపల్లిలో సీతారామ ప్రాజెక్ట్ సీతమ్మ సాగర్ ఎత్తిపోతల పథకం నెలకొల్పారనీ పేర్కొన్నారు. దాదాపు 90శాతం పనులు పూర్తి చేశారని తెలిపారు. అమలుగాని హామీల ఇచ్చి గద్దెనేక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హంగు ఆర్భాటాలు చేయడం తప్ప, ముగ్గురు మంత్రులు ముందుగా ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు తప్ప, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వకపోవటం మాత్రం దుర్మార్గం, ఇప్పటికైనా ఈ ప్రభత్వం మేల్కొని భద్రాద్రి జిల్లాకు సాగు నీరివ్వాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18నెలలు గడిచింది, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల్లోని 13అంశాలను తక్షణమే అమలు చేయవలసిందిగా ప్రజలు తరుపున బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు మేడగం లక్ష్మి నారాయణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహరావు, మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేస్వరా రావు, సారపాక పట్టణ అధ్యక్షులు కొంకాంచి శ్రీను, బీఆర్టీయు నాయకులు సానికొమ్మ శంకర్ రెడ్డి, బొల్లు సాంబ శివ రావు, మైనారిటీ అధ్యక్షులు సాదిక్ పాషా, గుల్ మొహమ్మద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు వళదాసు సలయ, బెజ్జంకి కనక చారి, చెక్క నర్సింహా రావు, ఏసొబ్, కొమటిరెడ్డి రాజశెఖర్ రెడ్డి , చిన్నపారెడ్డి, బాలి రెడ్డి, శనగా అప్పారావు, మెడగం శ్రీను వాసిరెడ్డి, బానొతు వంశీ, పంగి సురేష్, మేక పున్నం, రాయల నరెంద్ర, కాకాని రాంబాబు, రాఘవులు,మరియు నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్