చర్ల, నేటిసూర్య న్యూస్: చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోగల అన్ని హాస్టళ్లలో సోమవారం దోమల మందు (ఐఆర్ఎస్ 5%) స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హారిక దగ్గర ఉండి పరిశీలించారు. డాక్టర్ హారిక మాట్లాడుతూ వర్షాకాలం దోమలు అధికంగా వచ్చే ప్రమాదం ఉన్నది దోమలు మనల్ని కుట్టకుండ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు జ్వరం వచ్చినట్లయితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లాలని అక్కడ మంచి వైద్యం అందుతుందని తెలియజేశారు. హాస్టల్ చుట్టూ ప్రక్కలా నీరు నిలవకుండా చూసుకోవాలని, పిచ్చి మొక్కలు చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ ధర్మ రావు, హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ రామకృష్ణ, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ తులసి, హెల్త్ అసిస్టెంట్ ధర్మా రావు, నరసింహారావు, స్వరూప ఆశా కార్యకర్తలు రంగమ్మ, కృష్ణవేణి, ఉషారాణి పాల్గొన్నారు.
