పోలీసులు ఉండగా… ఆదివాసీలకు పండగ…
ఏజెన్సీ అభివృద్ధిలో సీఐ రాజువర్మ భాగస్వామ్యం భేష్.
నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పనే సీఐ ధ్యేయం.
చర్ల, నేటిసూర్య న్యూస్: స్వాతంత్ర్యం అంటే కేవలం పుస్తకాల్లో చదివాము… న్యూస్ పేపర్లు, ఛానల్స్ లో చూశాము… కానీ ఆ అనుభూతిని మేము జిల్లా పోలీసుల పుణ్యమా అని పొందుతున్నామని ఆదివాసులు ఆనందోత్సాహంతో పొంగి పోతున్నారు. ఏజెన్సీ అభివృద్ధిలో చర్ల సీఐ రాజువర్మ భాగస్వామ్యం భేష్ అని చెప్పవచ్చు. ఇంతకీ పోలీసోళ్లు అక్కడి ఆదివాసులకు చేసిన గొప్ప కార్యమేంటో వివరాల్లోకి వెళ్లి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని రాళ్లపురం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఐ రాజు వర్మ చలించి పోయారు. సరైన రోడ్డు లేక అవస్థలు పడుతున్న రాళ్లపురం ప్రజల మనోవేదనను సీఐ రాజు వర్మ గుర్తించారు. ఈ మేరకు మంగళవారం రోడ్డు మరమ్మత్తులు, నిర్మాణం చేశారు. వర్షాకాలం వచ్చిందంటే రాళ్లపురం, సమీప గ్రామాల ప్రజలకు రాకపోకలకు చాలా ఇబ్బందులు పడటాన్ని ఆయన ప్రత్యక్షంగా చూసి సీఐ ఆవేదన చెందారు. సీఐ రాజువర్మ ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి నడుంబిగించారు. ఇప్పటికే ఆయన అనేక గ్రామాల్లో పాఠశాలలను సొంత ఖర్చులతో నిర్మించారు. అంతేగాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అనేక వైద్య సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆయనకు తోడుగా ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్ సహకారాలతో సేవా కార్యక్రమాలకు పదును పెడుతున్నారు. అటవీ గ్రామాల ప్రజల కళ్ళల్లో ఆనంద భాష్పాలు వెలువడుతున్నాయి. శాంతి భద్రతలు, సేవా కార్యక్రమా లను రెండు కళ్లుగా భావిస్తూ చకచక పనులు కానిస్తున్నారు. ఇవన్నింటిని మనస్ఫూర్తిగా చేపడుతున్న సీఐ రాజువర్మ, ఇద్దరు ఎస్ ఐలు, చర్ల పోలీసులను ఆదివాసీలు, మండల ప్రజలు అభినం దనలతో ముంచెత్తు తున్నారు. ఏది ఏమైనా పోలీసోళ్లలో కూడా ఇలాంటి మంచి వాళ్లు ఉంటారా అని సీఐ రాజువర్మ, నర్సిరెడ్డి, కేశవ్ ల నిస్వార్ధ సేవను జిల్లా వ్యాప్తంగా కొనియాడబడటం నిజంగా అభినందనీయమే అవుతుందని చర్చనీయాంశమైంది.