ఈసం జ్యోతిర్మయి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలి… డాక్టర్ పి. రాజశేఖర్

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

ఈసం జ్యోతిర్మయి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలి..డాక్టర్ పి రాజశేఖర్ సీనియర్ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్
బండారు చందర్రావు (బీసీ ఆర్) ట్రస్ట్ ఆధ్వర్యంలో జ్యోతిర్మయికి సన్మానం.

భద్రాచలం, నేటిసూర్య న్యూస్:

ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్ష్స్ లో పిహెచ్డీ చేసి డాక్టరేట్ పొందిన భద్రాచలం డివిజన్ కు చెందిన ఈసం జ్యోతిర్మయకు బండారు చందర్రావు బిసిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి బిసిఆర్ ట్రస్ట్ కన్వీనర్ బండారు శరత్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ పి రాజశేఖర్ మాట్లాడుతూ జ్యోతిర్మయి ఫిజిక్స్లో డాక్టరేట్ పొందటం భద్రాచలం ఏజెన్సీకే గర్వకారణమని అన్నారు. ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. వారి తల్లిదండ్రులను కూడా ఆయన అభినందించారు. యుటిఎఫ్ సీనియర్ నాయకులు పి లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎం వి వి ఎస్ నారాయణ, ట్రస్టుల జిల్లా కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి తదితరులు మాట్లాడుతూ జ్యోతిర్మయి కృషిని అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ పి రాజశేఖర్ జ్యోతిర్మయిని శాలువాతో సన్మానించారు. పుష్పగుచ్చం మెమొంటో అందించారు. ట్రస్టు సభ్యులు ఆమె తండ్రి అనంతయ్య గారిని కూడా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులు రామ్మోహన్ రావు, కె ఎస్ ఎల్ వి ప్రసాద్, రాజబాబు తదితరులు పాల్గొని జ్యోతిర్మయకు అభినందనలు తెలియజేశారు. ట్రస్టు సభ్యులు వైవి రామారావు, డి లక్ష్మీ, కొలగాని రమేష్, ఎం లీలావతి, యు జ్యోతి, జీవనజ్యోతి, బిబిజి తిలక్, కోరాడ శ్రీనివాసరావు, ఎస్ భూపేందర్, ఎస్ అజయ్ కుమార్, కుంజా శ్రీనివాసరావు, ధనకొండ రాఘవయ్య, కే రవి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్