అనుమతుల్లేని ఇసుక, మట్టి రవాణా చేస్తే చర్యలు తప్పవు
విద్యార్థులు, ప్రజలకు సర్టిఫికెట్లు సత్వరమే అందజేస్తా…
నూతన తహసీల్దార్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు.
బూర్గంపాడు, నేటిసూర్య న్యూస్:
అనుమతుల్లేని ఇసుక, మట్టి రవాణా చేస్తే తగిన చర్యలు తీసుకోనున్నట్లు తహసీల్దారు వివేక్ హెచ్చరించారు. విద్యార్థులు, ప్రజలకు అన్ని రకాల సర్టిఫికెట్లు సత్వరమే అందించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల తహసీల్దారుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వివేక్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు వెల్ఫేర్ సొసైటీ (రిజిస్టర్ నెం.198/24) సభ్యులు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి మండలంలో ఆయన మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… త్వరలో ప్రభుత్వం ఇచ్చే సూచనల ప్రకారంగా భూ భారతి సమస్యలు కూడా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డొంకన చంద్రశేఖర్, ఎడారి రమేష్, సత్య వంశీ,ఉదయ్, బిట్ర సాయి బాబా, ఆదినారాయణ, బర్ల ప్రభాకర్. మురళి, ప్రసన్నకుమార్, ఆర్ ఐ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.