తలో చెయ్యేస్తే… పేదోడు గట్టెక్కుతాడు
మీ కోసం మేమున్నాం టీం ద్వారా రూ.11,600ల ఆర్ధిక సహాయం
పేద వారు కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా తలో చెయ్యేసి సహాయమందిస్తే, వారికి ఎంతో భరోసాను ఇచ్చినట్లవుతుందని చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ ఆనందం వ్యక్తం చేశారు. గత పాతికేళ్ల నుంచి వాచ్ మెకానిక్ గా మనందరికీ బాగా పరిచయం ఉన్న చర్ల మండలం లింగాపురంపాడు గ్రామానికి చెందిన గుంజి వెంకటేశ్వరరావు (60)కు అనారోగ్యం సోకడంతో హెర్నియా ఆపరేషన్ చేయడం జరిగింది. మరో రెండు నెలల వరకు బెడ్ రెస్ట్ లో ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఒక కుమారుడు చాలీ చాలని ఆదాయం. రెక్కాడితే గానీ డొక్కాడని ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే నిమిత్తం మీ కోసం మేమున్నాం టీం తరఫున ఫండ్ రైజింగ్ పోస్టు పెట్టి సేకరించిన రూ.11,600ల సొమ్మును శనివారం చర్లలోని మేమున్నాం టీం కార్యాలయంలో దొడ్డి తాతారావు చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ… పేద వారు కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా తలో చెయ్యేసి సహాయమందిస్తే, వారికి ఎంతో భరోసాను ఇచ్చినట్లవుతుందని తెలిపారు… ఈ కార్యక్రమంలో దొడ్డి సూరిబాబు, బివి. ప్రతాప్, కవ్వాల రాము, గాదెరాజు ప్రసాద్, దొడ్డి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.