గురుదేవ్ లో విశ్వ వీక్షణ అదుర్స్
విద్యార్థులకు అపార విజ్ఞానం సమకూర్పు
ఆవిష్కార్ వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా 7, 8, 9తేదీల్లో ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం (స్పేస్ సైన్స్) పై అవగాహన కల్పించుటకు శ్రీకాంత్ పంజాల (యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా – యుఎస్ఏ) మన గురుదేవ్ విద్యాలయానికి వచ్చి వర్క్ షాప్ నిర్వహించారు. వీరు ఆధునిక టెలిస్కోప్ ద్వారా గ్రహాల గమనం, గురు గ్రహం స్టార్ మ్యాపింగ్ మొదలైన స్పేస్ అద్భుతాలను పరిచయం చేశారు. ఈ మూడు రోజుల వర్క్ షాప్ లో మొదటి రోజు మూన్ మ్యాపింగ్, విశ్వం పుట్టుక, గ్రహాల గమనం, స్పేస్ మెషిన్ల గురించి సమగ్ర విశ్లేషణ చేశారు. అదేరోజు సాయంత్రం చంద్రుడిని టెలిస్కోప్ ద్వారా విద్యార్ధినీ, విద్యార్ధులకు చూపించారు. రెండవ రోజు స్టార్ మ్యాపింగ్ ను విద్యార్ధులచే తయారు చేయించారు. మూడవ రోజు సన్ డైల్ తయారు చేయించి, సాయంత్రం గురు గ్రహం చంద్రుడిని టెలిస్కోప్ ద్వారా చూపించారు. ముగింపు కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు వర్మ, సబ్ ఇన్స్పెక్టర్ నర్సిరెడ్డి పాల్గొని ఇంత చక్కటి కార్యక్రమం చేయటం అభినందనీయమని పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరగటానికి , వారి ఆలోచనల్లో శాస్త్రీయత పెరగటానికి ఎంతో దోహద పడతాయని తెలియజేశారు. మూడు రోజుల పాటు తమ విలువైన సమయాన్ని కేటాయించి మన గురుదేవ్ విద్యాలయంలో ఇంత విఙ్ఞానదాయకమైన వర్క్ షాప్ నిర్వహించినందుకు శ్రీకాంత్ పంజాలను ప్రధానోపాధ్యాయులు హెచ్.జి.వి ప్రసాద్, అకాడమిక్ కోఆర్డినేటర్స్ ఎంవి. సుబ్రహ్మణ్యం, జి. శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందం సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.