మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
టెన్త్ లో సత్తా చాటిన వారికి అభినందనల వెల్లువ.
నేటిసూర్య ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ నందర్శించారు. అంతకు ముందు ఆయన్ను ఆ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శాలువాతో సత్కరించారు. పది పరీక్ష ఫలితాల్లో నత్తా చాటిన మైనార్టీ గురుకుల విద్యార్థులకు, వారి అధ్యాపక బృందానికి కలెక్టర్ అభినందనలు తెలియజేశారు. అనంతరం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకుడు గుంతలకు స్వయంగా కలెక్టర్ పార, గునపం చేత పట్టి మట్టి తవ్వి తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, తహశీల్దార్ ముజాహిదుద్దీన్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ బర్ల ప్రభాకర్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Post Views: 26