బూర్గంపాడు, నేటిసూర్య న్యూస్:
బుధవారం వెలువడిన పదవ తరగతి ఫలితాలలో ప్రగతి విద్యానికేతన్ విద్యార్థులు అత్యధిక మార్కులతో విజయ ప్రభంజనం సృష్టించారు. ఈ పాఠశాల నుండి 21 మంది విద్యార్థులు పరీక్షకు హాజరై 21 మంది ఉత్తీర్ణులై 100% విజయాన్ని సాధించారు. తూము శ్రేయన్ 600 మార్కులకు గాను 591 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ గా నిలిచాడు. తాలూరి హిమకీర్తన 561/600, కాసర్ల గేయవర్ధని 556/600, జక్కా కావ్య 533/600, ఐతరాజు విష్ణువర్ధన్ 500/600 మార్కలు సాధించి విజయ జైత్ర యాత్ర తో స్కూలును మండలంలో ముందు ఉంచారని పాఠశాల కరస్పాండెంట్ సానికొమ్ము బ్రహ్మనంద రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎస్సి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ సంవత్సరం వెలువడిన ఫలితాలలో మా పాఠశాల గుణాత్మక ఫలితాలు, నాణ్యమైన విద్యా బోధన, ఒత్తిడి లేని చదువు, పాఠశాల యాజమాన్య నిరంతర పర్యవేక్షణ, టీచర్స్ పటిష్టమైన విద్యా ప్రణాళిక, విద్యార్థుల కృషి తోపాటు తల్లిదండ్రుల సహకారం వలన సాధించామన్నారు. ఈ విజయాలు విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల పట్ల మా బాధ్యతను మరింత పెంచాయన్నారు. రాబోయే కాలంలో మరింత పట్టుదలతో అంకితభావంతో కృషిచేస్తామన్నారు. ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు తల్లి దండ్రులు విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు.