చర్ల , నేటిసూర్య న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని రాహుల్ విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు. ప్రిన్సిపాల్ రాజు వర్మ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 59మంది పరీక్షలు రాయగా 59మంది ఉత్తీర్ణత చెందడం జరిగిందని తెలిపారు. ఇందులో 540 మార్కులకు పైగా ముగ్గురు విద్యార్థులు, 450నుంచి 500మార్కులు సుమారు అందరూ తేవడం జరిగిందన్నారు. ఇందులో బిట్రగుంట లాస్య లహరి 564 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానం పొందగా, గోగినేని వెస్లీ 545, పాఠశాల ద్వితీయ స్థానం, జవ్వాది స్నేహ శ్రీ 543 మార్కులు తృతీయ స్థానం సాధించారు. పదవ తరగతి ఫలితాల్లో రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది. హాజరైన విద్యార్థులు 59మంది, ఉత్తీర్ణులైన విద్యార్థులు 59మంది కాగా మండలంలో అత్యధిక మార్కులు సాధించిన పాఠశాలగా రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం నిలిచింది. 500కు పైగా మార్కులు 25 మంది సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ డీఎన్. కుమార్, డాక్టర్ ప్రతిభ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీవీపీసీ. శాస్త్రి, కొసరాజు హరిచరణ్, ప్రిన్సిపల్ వర్మ రాజు అభినందనలు తెలియజేశారు. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.