చర్ల నేటిసూర్య న్యూస్: మండల కేంద్రమైన చర్లలోని సాయిబాబా గుడి సమీపంలో గల నర్వేనెంబర్ 117లో గల ప్రభుత్వ భూమిని ఇటీవల కాలంలో కొందరు దుర్మార్గులు ఆక్రమించారని బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు కొండా కౌశిక్ ఆరోపిం చారు. బుధవారం స్థానిక రాహుల్ విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం 2025 అవగాహన నదస్సుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కి నమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా కొండా కౌశిక్ మాట్లాడుతూ.. మండల తహసీల్దార్ భూమిని సర్వే జరిపి ప్రభుత్వ భూమిగా గుర్తించి ఆ స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటుచేస్తే ఆ బోర్డును ఆక్రమణదారులు దొంగతనంగా తొలగించారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్ల పర్యటనకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు మండలంలో నెలకొన్న పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు.హెచ్చరిక బోర్డును తొలగించిన దుర్మార్గులపై వెంటనే రెవెన్యూ అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టకపోవడం కారణంగానే వారు దౌర్జన్యంగా అక్కడ నివాసం ఉంటున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి మానుకోవాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు స్వాధీనపరచుకున్న ఆయా ఇళ్లలో అక్రమ దారులు నివాసముండటం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించి దౌర్జన్యంగా అక్కడే నివసిస్తున్న దుర్మార్గులపై చట్ట పరమైన చర్యల్ని తక్షణమే తీసుకొని వారిని అక్కడనుండి ఖాళీ చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని ఆయన కలెక్టర్ ని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ భూమిలో రెవిన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలిగించిన వారిపై రెవిన్యూ అధికారులు స్వాధీనపర్చుకున్న ఇళ్లలో నివాసం ఉంటున్న దుర్మార్గులపై చట్టపర చర్యలు చేపడతామని తెలిపారు.
