చర్ల , నేటి సూర్య న్యూస్: ఈ నెల 25 నుంచి మే నెల 20వ తేదీ వరకు విద్యార్థినీ విద్యార్థులకు వేసవి సెలవులు సద్వినియోగం కావాలనే సంకల్పంతో “ఆవిష్కార్” వేసవి శిక్షణ శిబిరం గురుదేవ్ విద్యాలయంలో నిర్వహించబడుతున్నాయని ఆ స్కూలు హెచ్ఎం గిరి ప్రకటించారు. సెల్ ఫోన్, టీవీలతో గడిపే సమయం తగ్గించి వారికి క్రీడల్లో ఉన్న నృజనాత్మక శక్తికి అనుభవజ్ఞులైన హైదరాబాద్, ఖమ్మం నుంచి ప్రత్యేక శిక్షకులచే శిక్షణ ఇవ్వాలనే సంకల్పంతో గురుదేవ్ విద్యాలయం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఈ శిక్షణ ఈ నెల 25 నుంచి వచ్చే నెల 20 తేదీ వరకు ఉదయం 7 నుంచి 10గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరిమిత ప్రవేశాలున్నందున ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ప్రవేశాలు ఇవ్వబడుతుందని వివరించారు. ఇక్కడ నేర్పించబడే క్రీడల్లో ముఖ్యంగా ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, చదరంగం, వాలీబాల్, ఖోఖో, ఖగోళ పరిజ్ఞానం గురించి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. అలాగే సమ్మర్ క్యాంపులో పాల్గొనదలచిన వారు పాటించాల్సిన కొన్ని నియమ నిబంధనలు సూచించారు. సమ్మర్ క్యాంపునకు తల్లిదండ్రులు స్వయంగా తీసుకొచ్చి తీసుకొని వెళ్లాలని తెలిపారు. సైకిల్స్ ఇతర వాహనాలపై విద్యార్థులు స్వయంగా వచ్చేందుకు అనుమతించబడుతుందన్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరు విధిగా వాటర్ బాటిల్ తెచ్చుకోవాలని, సెల్ ఫోన్ విలువైన ఆభరణాలు తీసుకురాకూడదన్నారు. సమయపాలన తప్పక పాటించాలని
కోరారు.
