భద్రాచలం ,నేటి సూర్య ప్రతినిధి: భద్రాచలం నబ్ డివిజన్ పరిధిలో ఎక్కడ కూడా అనుమతులు లేకుండా ఎవరైనా ఇష్టారీతిన హోర్డింగులు కడితే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ASP విక్రాంత్ కుమార్ సింగ్ IPS హెచ్చరించారు. ఇటీవల కాలంలో కొందరు రోడ్ల పక్కన, డివైడర్లకు మధ్య ఇష్టానుసారంగా ఫ్లెక్సీలు కడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలవల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశముందన్నారు. అంతేగాకుండా వర్షాలు, ఈదురు గాలులు నేపథ్యంలో ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు తెగిపోయి ప్రమాదాలు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి గ్రామ పంచాయతీ అధికారుల అనుమతి తీసుకున్న ప్రకారం వారు కేటాయించిన స్థలాల్లోనే ప్లెక్సీలు, హెర్డింగులు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. ఇక మీదట ఎవరైనా ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటుచేసి రోడ్డు ప్రమాదాలకు ఇతర ప్రమాదాలకు కారకులయ్యే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎలాంటి పుట్టినరోజు, ఇతర కార్యక్రమాలకు నంబంధించిన, బ్యానర్లను అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన, ప్రమాదాలకు కారణమయ్యేలా ఏర్పాటుచేసిన వారిపై కచ్చితంగా చర్యలు తప్పవన్నారు. అంతేగాకుండా ఆ ఫ్లెక్సీలు, హెూర్డింగులు ప్రింటింగ్ చేసే వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
