చర్ల, నేటిసూర్య న్యూస్ : ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో చర్ల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. మంగళవారం నాడు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ వారు ప్రకటించిన ఫలితాల్లో ఎంపీసీ నుంచి సెకండియర్ లో సీహెచ్. నందిని 925 మార్కులు, ఫస్టియర్ లో బి. తనుష్య 464 మార్కులు సాధించి ప్రభుత్వ జూనియర్ కళాశాల పేరు ప్రఖ్యాతలను ఇనుమడింపజేశారు. అలాగే శ్రీ మేధా 460 మార్కులు, వొకేషనల్ విభాగం ద్వితీయ సంవత్సరంలో ఎంపీహెచ్ డబ్ల్యు కోర్సులో మోడం సుజాత 946 మార్కులు, ఆక్సా 909 మార్కులు సాధించి ఆ కోర్సుకే వన్నె తెచ్చారు. కాగా, టీ అండ్ హెచ్ఎం కోర్సుకు చెందిన కొప్పినేటి శ్రీజ 903మార్కులు సాధించగా, వోకేషనల్ ప్రథమ సంవత్సరం ఎంఎల్ టీ కోర్సులో ఎన్. రవీంద్ర 484 మార్కులు, ఎంపీహెచ్ డబ్ల్యు కోర్సులో ఇంగే 468మార్కులు సాధించి ప్రతిభను చాటారు. మొత్తంగా రెండవ సంవత్సరంలో 50శాతం మొదటి సంవత్సరంలో 45శాతం ఉత్తీర్ణత శాతాన్ని నమోదుచేసి మంచి ఫలితాలను సాధించారు. ఈ సందర్భంగా మంచి మార్కులను సాధించిన విద్యార్థినీ, విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ ఎం. నరేందర్, అధ్యాపక బృందం అభినందించారు.
