చర్ల , నేటిసూర్య న్యూస్: గురుదేవ్ స్కూల్లో పిల్లల మానసిక, శారీరక వికాసానికి దోహదవడే స్కౌట్స్ అండ్ గైడ్స్ లో విద్యార్థులను భాగస్వాములను చేయడం సంతోషదాయకమని సిఐ రాజు వర్మ ప్రధానో పాధ్యాయులు హెచ్.జీవీ. ప్రసాద్ ని అభినందించారు. మంగళవారం గురుదేవ్ విద్యాలయంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్ ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గురుదేవ్ విద్యాలయంలో ఇంతమంది విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ లో పాల్గొనడం సంతోషదాయకమని ప్రశంసించారు. చిన్న నాటి నుంచే విద్యార్థులను క్రమ శిక్షణ అలవాటు చేయడం వల్ల వారు పెద్దయ్యాక సమాజానికి చేదోడు వాదోడుగా నిలుస్తా రని ఆకాంక్షించారు. ఈ కార్య క్రమానికి డిస్ట్రిక్ట్ స్కౌట్ కమి షనర్ యు. ఆనంద్ కుమార్, స్కౌట్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఎం. శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ ఎం. భరతమాత, స్కౌట్స్ ట్రైనింగ్ కమిషనర్ పి. వెంకట రమణ, ఆర్గనైజింగ్ కమిషనర్ జి. చలపతిలు హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమానికి అతిథులుగా చర్ల సిఐ ఎ. రాజు వర్మ, ఎస్ఐ ఆర్ నర్సిరెడ్డి, ఎస్ఐ పి. కేశవరావు లాంటి పెద్దలు వీరందరికీ కలర్ పార్టీ సాదర స్వాగతం పలికారు. సీఐ రాజువర్మ, ఎంఈఓ వెంకట రమణలు కలిసి స్కౌట్స్ పతాకావిష్కరణ చేశారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు వతాక, ప్రార్థనా గీతాలు ఆలపించారు. కబ్స్ బుల్ బుల్స్ అండ్ స్కౌట్స్ బర్డ్స్ చే వందన స్వీకారం ఇచ్చారు. తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవిష్కర్తలైన బెడెన్ పావెల్, లేడీ బెడెన్ పావెల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ టీం వారు విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కో-ఆర్డినేటర్స్ ఎంవీఎన్. సుబ్రమణ్యం, జి. శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
