భద్రాచలం , నేటిసూర్య: స్థానిక అంబేద్కర్ హాస్పిటల్ నందు స్వయం గౌరవ ఉద్యమ వేదిక, పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితి, మహాజన మహిళా సమైక్య ల ఆధ్వర్యంలో సామాజిక తత్వవేత్త స్వయం గౌరవ ప్రతీక మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా రాజ్యసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిస్వయం గౌరవ ఉద్యమ వేదిక నాయకులు, ప్రముఖ హేతువాది డాక్టర్ భాను ప్రసాద్ , పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి అధ్యక్షులు కొమ్మ గిరి వెంకటేశ్వర్లు ఎంఎంఎస్ జిల్లా నాయకులు మేకల లత మాట్లాడుతూఅట్టడుగు వర్గాల అభ్యునతి కోసం నిరంతరం పోరాటం చేసిన పోరాట యోధుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని,మహిళల విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన సంఘసంస్కర్తసాంఘీక విప్లవకారుడు మహాత్మ పూలేనే అని,బ్రాహ్మణీయతను ప్రతిఘటించిన సాహసి,వేద పురాణాల వాస్తవికతను ప్రశ్నించిన హేతువాది,సమాజంలో కుల హెచ్చుతగ్గులను సమానంగా చెయ్యడానికి నిరంతరం పని చేసిన త్యాగశీలి పూలే అని,సామాజిక వ్యవస్థలో ఉన్న రోగాలను పసిగట్టి అసలైన శాస్త్ర చికిత్స చేసిన సామాజిక న్యాయ వైద్యుడు ఫూలే అని అన్నారు. మన మంతా పూజించే డా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు మహాత్మా జ్యోతిబా పూలే అని గుర్తు చేశారు. మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగిందని అని అన్నారు. మనమంతా మహాత్మా జ్యోతిబా పూలే, జ్యోతిబాపూలే ఆశయాలను కొనసాగించడమే ఆ మహనీయులకు మనం ఇచ్చే ఘన నివాళి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వయం గౌరవ ఉద్యమ వేదిక నాయకులు చిన్న దిలీప్, వై ప్రవీణ్,షాహీన్,పొన్నాల వెంకటరెడ్డి, అలీ, మహాజన మహిళ సమైఖ్య ఎంఎంఎస్ జిల్లా నాయకులు మేకల లత, కొచర్ల కుమారి, కొప్పుల నాగమణి, గద్దల కృష్ణవేణి, బొమ్మన వేణి మంగ,ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు అలవాల పెరియార్ రాజా మాదిగ, కొప్పుల తిరుపతి మాదిగ, యశోద ఫౌండేషన్ సేవాసమితి సభ్యులు రాయల రాము,వెంకటేశం, ఈశ్వర్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు
