నేటిసూర్య ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర మాలమ హానాడు వ్యవస్థాపకులు డా అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు, సామాజిక ఉద్యమనేత, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి, పార్టీ గెలుపు కోసం తన తుంగతుర్తి నియోజకవర్గ అసెంబ్లీ సీట్లు కూడా త్యాగం చేసిన డాక్టర్ అద్దంకి దయాకర్ పేరును కాంగ్రెస్ పార్టీ అదీష్టానం యంయల్ సి గా పేరు ఖరారు చేయడం పట్ల చర్ల మండల కాంగ్రెస్ నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాటానికి నిరంతరం వివిధ రకాల వేదికలమీద మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలుపుకోసం నిరంతరం కృషి చేసిన అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం అనేది హర్షణీ యమని ఆయన సంతోషం వ్యక్తం చేసారు.