ఆందోళన కలిగిస్తోన్న మరణాలు
వింత వ్యాధే కారణమా… మహువా కారణమా…!?
డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ అభిప్రాయం
నేటిసూర్య ప్రతినిధి:
ఇటీవల జమ్మూ కశ్మీర్లో మాదిరిగానే ఇప్పుడు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇందుకు కారణం వింత వ్యాధి అయిండొచ్చా… లేదా అక్కడి రైతాంగం మహువా పంట సేకరణలో చోటు చేసుకుంటోన్న నిర్లక్ష్య కారణమని అక్కడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అకస్మాత్తుగా నుక్మా జిల్లాలోని ధనికోర్టా గ్రామం నుంచి ప్రాణాలు కోల్పోతున్న వార్తలు రావడం ప్రారంభించాయి. సుక్మా జిల్లా కేంద్రం నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి ఒక ఆరోగ్యం బృందాన్ని వెంటనే పంపారు. బాధితులంతా చనిపోయే ముందు ఛాతీ నొప్పి, నిరంతర దగ్గుతో బాధపడుతున్నారని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ధనికోర్ట గ్రామంలో దాదాపు ప్రతి ఇంటి ప్రజలు ప్రభావితమయ్యారు. ఇక్కడ నివసించే ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇందుకు నంబంధించి సుక్మా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ మాట్లాడుతూ…. ఇటీవల ఐదు మరణాలు సంభవించాయని చెప్తారు. జిల్లా ఆస్పత్రిలో వయను సంబంధిత వ్యాధుల కారణంగా ముగ్గురు మరణించారని, మిగిలిన ఇద్దరి మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు ఆరోగ్య బృందాలు గుర్తించిన దాని ప్రకారం వాతావరణంలో మార్పు, మహువా పంట సేకరణ కారణాలు కావచ్చని చెప్పారు. గ్రామస్థులు అడవికి వెళ్లి రోజంతా మహువాను సేకరిస్తారు. దీని కారణంగా వారు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు.
ఇంటింటికి తిరిగి సర్వేలు చేస్తున్నాం : డాక్టర్ కపిల్
ప్రజలకు చికిత్స చేయడానికి వైద్య శిభిరాలు నిరంతరం పని చేస్తున్నాయని డాక్టర్ కపిల్ దేవ్ కశ్యప్ వెల్లడించారు. అడవికి వెళ్లి మహువాను సేకరించాలని గ్రామస్థులు మొండిగా ఉండటంతో వారికి ఓఆర్ఆఎస్ ఇస్తున్నారు. ఇంటింటికి తిరిగి నర్వేలు నిర్వహిస్తున్నారని వివరించారు. అడవి నుంచి తిరిగి వచ్చే వారికి లేదా పొలాల్లో పనిచేసి విపరీతంగా చెమటలు పడుతున్న వారికి ఓఆర్ఎన్ ఇస్తున్నారు. అసౌకర్యంగా ఉన్నామని ఫిర్యాదు చేస్తున్న వారికి చికిత్స పర్యవేక్షణ జరుగుతోందని తెలిపారు. ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే నివేదించమని వారికి చెప్పామన్నారు. ఓ ప్రభుత్వ వైద్యుడి ప్రకారం… రెండు రోజుల క్రితమే మరణాల గురించి తమకు సమాచారం అందిందని వైద్య బృందాలను వెంటనే పంపించామని తెలిపారు. వైద్యులు గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. బాధితులందరినీ దహనం చేసి, శవ పరీక్షలు నిర్వహించకపోవడంతో మరణాలకు కారణం ఇంకా నిర్ధారించబడలేదని స్పష్టం చేశారు.