నేటిసూర్య ప్రతినిధి:
నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి ఎవరూ నహకరించవద్దని భద్రాచలం ఏఎస్సీ విక్రాంత్ కుమార్ సింగ్ గ్రామస్తులను సూచించారు. చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బట్టిగూడెం, రామచంద్రాపురం గ్రామాల్లో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చర్ల పోలీసులు సీఆర్పీఎఫ్ అధికారులతో కలిసి ఈ రెండు గ్రామాల్లోని ప్రతి ఇంటిని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ కొన్ని సూచనలు, నలహాలిచ్చారు. గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. పరోక్షంగానైనా, ప్రత్యక్షంగానైనా నిషేధిత మావోయిస్టు పార్టీకి నహకరించిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్న పోలీస్ శాఖ తరపున అట్టి నమన్యలను సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ వాటి పరిష్కారానికి కృషిచేస్తామని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్, చర్ల సీఐ రాజువర్మ ఎస్ఐ నర్సిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.