చర్ల, నేటిసూర్య న్యూస్: తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చర్ల మండల మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు విస్సా నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో 22 శాతం ఉన్న మున్నూరుకాపు కుల జనాభాను మూడున్నర శాతం తక్కువగా చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు వెంటనే రీ సర్వే చేసి మున్నూరు కాపు కులస్తులకు న్యాయం చేయాలని అలాగే మున్నూరు కార్పొరేషన్ కు దిశా నిర్దేశం ఇస్తూ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో మున్నూరు కాపులకు సముచిక స్థానం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పటేల్ వెంకటేశ్వరావు, గాలి గోపి, బిట్రగుంట క్రాంతికుమార్, కర్నాటి నాగేశ్వరరావు, పంజా రాజు, చింతం శ్రీకాంత్, తాండవ రాయుడు, ముత్యాల వెంకటస్వామి, నాగరాజు, రాట్నాల శ్రీరామ్మూర్తి, కొట్రా సంతోష్, గూడపాటి రంజిత్ ,కొమ్మినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు











