చర్ల, నేటిసూర్య : ప్రతీ ఆదివారం చర్లలో జరిగే సంతకు వచ్చిన పేదలకు అన్న దానం చేసి సేవలందించడం ఎంతో పుణ్యకార్యమని, ప్రతీ ఒక్కరూ కూడా ముందుకొచ్చి తమతమ శుభకార్యాలు, జ్ఞాపకార్ధ కార్యాలను ఈ పేదవారి దీవెనలతో జరుపుకోవాలని చైర్మన్ డాక్టర్ నీలి ప్రకాష్ కోరారు. మీ కోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న వారాంతపు ప్రతీ ఆదివారం – అన్నదానం – 168వ వారం కార్యక్రమంలో భాగంగా బొజ్జ సీతమ్మ, మీసాల నూకాలమ్మల జ్ఞాపకార్ధం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు పంపిన వితరణతో ఆదివారం చర్ల శాంతి భవన్ సమీపంలోని రౌతు నర్సింహారావు కాంప్లెక్స్, తాళ్ళూరి గార్డెన్స్ వద్ద సుమారు 250మందికి ఉచిత భోజనాలు పెట్టారు. ఈ అన్నదాన కార్యక్రమంలో కూరగాయల వ్యాపారి అయిన బళ్లారి రవి ఉచిత అరటి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్న దాతలు శేశెట్టి సాంబ శివరావు, శేశెట్టి రవితేజ, రౌతు నర్సింహారావు, బూహ్యవరపు ప్రతాప్, కొంగూరు నర్సింహారావు, దొడ్డ ప్రభుదాస్, ఉమ్మలేటి మల్లికార్జునరావు, సొల్లంగి నాగేశ్వరరావు, ముమ్మనేని అరవింద్, బంటు నర్సింహారావు, చింతల రాము తదితరులు పాల్గొన్నారు.











