చర్ల, నేటిసూర్య న్యూస్:
గ్రేస్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ చర్ల మండలం లోని పూజారి గూడెం, లెనిన్ కాలనీ, సింగాసముద్రం గ్రామాల్లోని జి.యస్.యస్ డే కేర్ సెంటర్లోని 130 మంది నిరు పేద విద్యార్థులకు నూతన వస్త్రాలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ నీలి ప్రకాష్, చర్ల ఎస్ ఐ కేశవ్ లు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా డాక్టర్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు కొత్త బట్టలు పంపిణీ చేయడం చాలా సంతోషకరమని ఇటువంటి సహాయాన్ని అందిస్తు న్నటువంటి సంస్థ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు . మారుమూల గిరిజన గ్రామాలలో పేద పిల్లలకు సహాయం చేయడానికి ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని సంస్థ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో చైల్డ్ కేర్ సెంటర్ ఇంఛార్జిలు పూజారి రాజేశ్వరి, లక్ష్మీ నారాయణ, సంస్ధ ప్రతినిధులు మురళీ కృష్ణరెడ్డి , సతీష్ డే కేర్ సెంటర్ సిబ్బంది, సీనియర్ జర్నలిస్టు దొడ్డా ప్రభుదాస్, రిటైర్డ్ టీచర్ కొంగూరు. నర్సింహారావు గ్రామస్తులు పలువురు పాల్గున్నారు. ఇటీవల గౌరవ డాక్టరేట్ పొందిన నీలి ప్రకాష్ ను సంస్థ ప్రతినిధులు శాలువా కప్పి సన్మానించారు.











