మావోయిస్టు దళ సభ్యులుఅరెస్టు…..4గురు దళ సభ్యులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ నర్సిరెడ్డి

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

చర్ల, నేటిసూర్య న్యూస్:

మావోయిస్టు ల ఏరివేతలో భాగంగా చర్ల పోలీసులు 4గురు మావోయిస్టులను శుక్రవారం అరెస్టు చేసారు. ఇందుకు సంబంధించి చర్ల సిఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. చర్లమండలం లోని  తాలిపేరు డ్యాం సమీపంలో తిప్పాపురం గ్రామానికి వెళ్లే రహదారిలో చర్ల ఎస్ఐ నర్సిరెడ్డి ఆద్వ ర్యంలో చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, CRPF 141 సిబ్బందితో కలసి వాహన తనికీలు నిర్వహిస్తుండగా మారుమూల అటవీ ప్రాంతమైన తిప్పాపురం గ్రామంనుండి 4 వ్యక్తులు (ఇద్దరు‌ఆడ, ఇద్దరు మగ) అటుగావస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా పోలీసులు చాలచక్యంగా వారిని పట్టుకొని విచారించారు. అలాగే వారి వద్ద ఉన్న పాలిథిన్ సంచిని తనకీ చేయగా వావోయిస్టు పార్టీకి చెందిన కొన్ని కరపత్రాలు ఉన్నాయి, నలుగురు వ్యక్తులు  గత కొంతకాలంగా నిషేదిత మావోయిస్టు పార్టీలో దళ సభ్యులుగా పని చేస్తున్నారని సిఐ తెలిపారు. పామేడ్ ఏరియా కమిటీ DVC ఐనా సుక్కి ఉడతమల్లు గ్రామంలో ఈ 4గురిని కలిసి కొన్ని సామాన్లు అలాగే కొన్ని కరపత్రాలు ఇచ్చి తిప్పాపురం గ్రామ సమీపంలో అలాగే చత్తీస్‌గఢ్ బోర్డర్లో వేయమని చెప్పగా వీటిని తీసుకొని వస్తుండగా ఈ వ్యక్తులు అనుమానాస్పందా తిరుగుతూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని అరెస్టు చేసినట్లు సిఐ రాజు వర్మ తెలిపారు. పట్టుబడిన నలుగురు మావోయిస్టు దళ సభ్యుల వివరాలు.. చత్తీస్గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, పోలంపల్లి గ్రామానికి చెందిన గట్టుపల్లి ఊర అలియాస్ సోమన్న, చతిస్గడ్ రాష్ట్రం, సుకుమా జిల్లా చింతల్ నాట్ మొరోపాల్ గ్రామానికి చెందిన ఉంగ , దంతేవాడ జిల్లా, ఆలనర్ గ్రామానికి చెందిన కడితిలక్కే, సుకుమా జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిన సోడి సుక్కే లని తెపిపారు

ఇప్పటికే అనేకమంది నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు. సభ్యులు తమ పార్టీ ప్రజలలో ఆదరణ కోల్పోయిందని గ్రహించి ఈ సిద్ధాంతాలు విజయం సాధించలేమని తెలుసుకొని ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని అనేకమంది పోలీసు వారి సమక్షంలో లొంగిపోవడం జరిగింది. మావోయిస్టులు పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునే వారు స్వచ్ఛందంగా కానీ బంధువుల ద్వారా కానీ తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో లేదా జిల్లా పోలీసు ఉన్నతా ధికారులను గాని సంప్ర దించాలని చర్ల సిఐ రాజువర్మ తెలిపారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్