తమ అక్రమ దందాకు అడ్డు వస్తాడనే టీసీ అప్పగింత..

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

తప్పు ఒప్పుకోనందుకు తొలగించాం : హెచ్ఎం

ఉప్పుసాక ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా తెలిసిన ఘటన

బూర్గంపాడు, నేటిసూర్య న్యూస్ : ఉన్న మాట చెప్పొద్దు.. ఊర్లో ఉండొద్దు అనే విధంగా మారిందో మటన. విద్యాబుద్ధులు చెప్పి పిల్లల భవిష్యత్తు చక్కదిద్దాల్సిన బాధ్యతగల ఉపాధ్యాయులే అక్రమాలకు పాల్పడటం గమనార్హం. గురువుల అక్రమాలు పిల్లలు ఎక్కడ బయట పెడతారనే భయంతో ఆ పిల్లాడినే శాశ్వతంగా తొలగించారు ఈ ప్రబుద్ధులు. వివరాల్లోకి వెళితే… ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం, ఉప్పసాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటు చేసుకోవడం కాస్త ఆలన్యంగానే బయటకు పొక్కింది. బియ్యం అక్రమంగా తరలిస్తుండగా చూసినందుకు విద్యార్థికి టీసీ ఇచ్చిన ఘటన భద్రాద్రి జిల్లా బూర్గంవహాడ్ మండలం ఉప్పసాక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా తెలిసింది. నరిగ్గా మూడు వారాల కింద స్కూల్లో తెల్లవారు జామున బియ్యాన్ని వాహనంలో సిబ్బంది అక్రమంగా తరలిస్తున్నారు. తొమ్మిదో తరగతి విద్యార్థి సంతోష్, మరో టెన్త్ క్లాస్ విద్యార్థులు కళ్లారా చూశారు. వాచ్ మెన్ చూసి వారిని మందలించాడు. టెన్త్ క్లాస్ పిల్లాడ్ని వాచ్ మెన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాదన చోటు చేసుకుంది. తనతో పాటు సంతోష్ కూడా చూశాడని టెన్త్ స్టూడెంట్ చెప్పాడు. దీంతో వాచ్ మెన్ వెళ్లి సంతోష్ ను కొట్టడం ప్రారంభించగా ఎందుకు కొడుతున్నావంటూ ఎదురు తిరిగాడు. అనంతరం తనపై సంతోష్ దాడి చేశాడంటూ వార్డెన్, హెచ్ఎంకు వాచ్ మెన్ ఫిర్యాదు చేశాడు. బియ్యం అక్రమ తరలింపు విషయం బయట చెబితే ఇబ్బందులు వస్తాయని, వాచ్ మెన్ పై దాడి చేశాడనే ఆరోపణతో విద్యార్థికి హెచ్ఎం టీసీ ఇచ్చి వంపించాడు. దీంతో సంతోష్ తల్లిదండ్రులు వెళ్లి వేడుకున్నా హెచ్ఎం వినలేదు. టెన్త్ క్లాస్ స్టూడెంట్ కు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. బియ్యం తరలించడాన్ని చూసినందుకే తమ కొడుకుకు టీసీ ఇచ్చి వంపించారని తల్లిదండ్రులు పాయం రాము, నత్యవతిలు మొర పెట్టుకున్నారు. గతంలోనూ పాఠశాలలో బియ్యం అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇటీవల ఒక విద్యార్థిని స్కూల్ సిబ్బంది కొట్టడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. ప్రస్తుతం ములకలవల్లి మండలం పాత గుండాలపాడుకు చెందిన పాయం సంతోష్ కు టీసీ ఇచ్చిన విషయమై ఎమ్మెల్యే జారె ఆదినారాయణతోపాటు కలెక్టర్, ఐటీడీఏ పీవో సమగ్ర విచారణచేసి న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు కోరారు. పాఠశాలలో జరిగే అక్రమాలపై పీఓ నిఘా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

హెచ్ఎం వివరణ
అర్ధరాత్రి ఇద్దరు స్టూడెంట్స్ డార్మెటరీ వైపు వెళ్తుండగా ఎక్కడికి వెళ్తున్నారంటూ వాచ్ మెన్ అడిగినందున పొంతన లేని సమాధానాలు చెప్పడంతోపాటు రాళ్లతో దాడి చేశారని, అందుకే టీసీ ఇచ్చినట్టు ఆశ్రమ పాఠశాల హెచ్ఎం భీమా తెలిపారు. వాచ్ మెన్ కంటి పైన గాయమైందని, స్టూడెంట్ సంతోష్ తప్పును ఒప్పుకోకపోవడంతోనే టీసీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్