చర్ల, నేటిసూర్య న్యూస్: చదువు సంస్కారమే విద్యార్దులకు శ్రీరామరక్ష అని గుంటూరు తులసీ సీడ్స్ జనరల్ మేనేజర్ జవ్వాది కోదండ రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన తల్లిదండ్రులు జవ్వాది నారాయణమూర్తి – జయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయ విద్యార్దులకు పాదరక్షలు, 50 కేజీల బియ్యం తో పాటు భోజనం ఏర్పాట్లు, మిఠాయిలు, పండ్లను అందచేసారు. ఈ సందర్భంగా కోదండ రాంబాబు విద్యార్దులను ఉద్దేసించి ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ చదువుతోనే ఉన్నత స్దితికి చేరుకోవచ్చని అన్నారు. విద్యతోనే విజ్ఞానం అందుతుందన్నారు. ప్రతి విద్యార్ది క్రమ శిక్చణతో చదివి జీవితంలో స్దిరపడి తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలన్నారు. ఇక్కడి విద్యార్దుల క్రమశిక్షణ తమను ఎంతో ఆకట్టుకున్నదని అన్నారు. కార్యక్రమంలో వనవాసీ కల్యాణ పరిషత్ దక్షణ మద్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి తాడేపల్లి శివరామకృష్ణ, వనవాసీ మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత, జవ్వాది కుటుంబ సభ్యులు జవ్వాది రవిచంద్రకుమార్, జవ్వాది మురళీకృష్ణ, జవ్వాది శ్రీనివాసరావు, జవ్వాది కుబేర శ్రీకాంత్, జవ్వాది ప్రశాంత్, కోరి గణేష్, జవ్వాది పూర్ణిమ, జవ్వాది త్రైతీక్య, పగడాల గీతాంజలి, జవ్వాది స్నేహ శ్రీ, నిలయ కమిటీ సభ్యులు తాటి పాపారావు, గొంది శోభన్‌బాబు, గోగికార్ రాంలక్ష్మణ్, పోలిన రమాదేవి, పాశికంటి శ్రీదేవి, గొంది ప్రసన్నకుమారి, పాల్గొన్నారు.











