అథ్లెటిక్స్ లో అదుర్స్… అంగన్వాడీ టీచర్…….జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన సౌభాగ్యవతి

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

బూర్గంపాడు, నేటిసూర్య న్యూస్: ఆడోళ్లు మగాళ్లకంటే తక్కువేమీ కాదనీ… ఎన్నోమార్లు సమాజంలో నిరూపిస్తున్నారు… తమకు ఛాన్స్ వస్తే చాలు వయస్సుతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశంతో అందలమెక్కుతున్నారు ఆడోళ్లు… అదే కోవకు చెందిన ఓ మారుమూల ప్రజెన్సీ గ్రామంలో అంగన్ వాడీ టీచర్ గా పని చేస్తోన్న కణితి కృష్ణవేణి తన సత్తా చాటి ఏకంగా జిల్లా ఖ్యాతినే ఇనుమడింపజేసి భవిష్యత్తులో మాస్టర్ కేటగిరీలో జాతీయ స్థాయిలో కూడా పాలుపంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం తాళ్ల గొమ్మూరు గ్రామ అంగన్వాడీ టీచర్ గా కణితి కృష్ణవేణి పని చేస్తున్నారు. ఈ నెల హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఆమె పాల్గొన్నారు. ఈ పోటీల్లో భాగంగా ఆమె వంద మీటర్లలో తృతీయ స్థానం, 200 మీటర్లలో ద్వితీయ స్థానం, లాంగ్ జంప్ లో ద్వితీయ స్థానం, 400 రిలేలో తృతీయస్థానం సాధించి అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. ఈ శుభ సందర్భంగా తాళ్ళగొమ్మూరు గ్రామ పెద్దలు, మండల అంగన్వాడీ టీచర్లు, స్థానిక నాయకులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తాళ్ళగొమ్మూరు అంగన్వాడీ కేంద్రంలో కణితి కృష్ణవేణికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పాల్గొన్న పలువురు ప్రముఖులు మాట్లాడుతూ…. ఈ రోజుల్లో మహిళలు ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారని, కృషి పట్టుదల ముందు వయసు అడ్డుకాదని నిరూపించారని ఆమె శభాష్ అని భుజం తట్టారు. ఈ విజయాన్ని అందుకోవటానికి ప్రోత్సహించిన, సహకరించిన ఆమె భర్త, పిల్లల సహకారం కూడా గర్వించదగినదని కొనియాడారు. కాగా, విజయ దుందుభి మోగించిన కణితి కృష్ణవేణి మాట్లాడుతూ… తనకు సహకరించిన కుటుంబ సభ్యులకు, ఆమె ప్రాక్టీస్ ఇచ్చి ప్రోత్సహించిన కోచ్ కు, ఇంతటి అభిమానంతో తనను సన్మానించిన పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో వచ్చే నెలలో కేరళలో జరిగే నేషనల్ అథ్లెటిక్స్ లో కూడా విజయం సాధిస్తానని పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రామారావు, బెల్లంకొండ వాసుదేవరావు, తాళ్లగొమ్మూరు మాజీ సర్పంచ్ కోయల పుల్లారావు, తాతా మాధవి లత, బేబీ, తేజావత్ మంగీలాల్, హెచ్ఎం కోటేశ్వరరావు, వడ్లమూడి కుమారి, అంగన్వాడీ టీచర్ అనసూర్య తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్