చర్ల, నేటిసూర్య న్యూస్ :
విద్యార్థులు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మోటివేషనల్ స్పీకర్, సర్టిఫైడ్ స్పీకర్ బంగారు పతక గ్రహీత, రిటైర్డ్ ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాది వెంకటేశ్వరబాబు (బాబ్జీ) వెల్లడించారు. మీ కోసం మేమున్నాం టీం చర్ల వారి ఆధ్వర్యంలో గురుదేవ్ విద్యాలయం వేదికగా బుధవారం విద్యార్థినీ, విద్యార్థులు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు ఒత్తిడికి గురై పరీక్షల్లో వెనుకబడు తుండటం, వారి తల్లిదండ్రులు అవగాహన లేమితో పిల్లల ప్రావీణ్యత గమనించకుండా వేర్వేరు కోర్సుల్లో జాయిన్ చేస్తుండటం… వంటి అనేక సమస్యలకు పరిష్కారం లభించే విధంగా ట్రైనింగ్ ఇచ్చేందుకు పలు మార్గ నిర్దేశాలు చేశారు. విద్యార్థులు ధైర్యంగా, నిబద్ధత, క్రమశిక్షణతో నడుచుకుంటే గొప్పగొప్ప లక్ష్యాలను ఛేదించగలరని చెప్పారు. చిన్న వయసు నుండే మెదడును పదును ఉండేలా చూసుకుంటూ చదువు కొనసాగించాలని సూచించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మంచిగా చదువుకొని ముందుకు సాగాలని, లక్ష్యం పెట్టుకొని చదివినట్లయితే అనుకున్న గమ్యాన్ని తప్పక చేరుతారని, అప్పుడే మీరు ఉన్నత స్థాయిలో నిలబడ తారని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు వస్తుందన్నారు. విద్యతోపాటు ఆటల పోటీల్లో కూడా ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. అదే విధంగా విద్యాలయం ప్రధానోపాధ్యాయులు గిరి ప్రసాద్, మేమున్నాం సంస్థ చైర్మన్ డాక్టర్ లయన్ నీలి ప్రకాష్ ప్రారంభోపన్యాసం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి (ఎంఈఓ) పరిటాల రమణ, సంఘ సేవకులు పరుచూరి మనోహర్ ప్రసాద్, దొడ్డి తాతారావు, గొట్టిపాటి శ్రీనివాసరావు, సొల్లంగి నాగేశ్వరరావు, కొమరవరపు రవి, పాత్రికేయులు దొడ్డ ప్రభుదాస్, జవ్వాది మురళీకృష్ణ, తిరువాయిపాటి రాజేష్, గూబ సురేష్, పాఠశాల కోఆర్డినేటర్ మల్లాది సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు లతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.











