వనవాసీ విద్యార్దులకు రగ్గుల పంపిణీ.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

చర్ల,  నేటిసూర్య న్యూస్ : చింతలపూడి రామకృష్ణ , లక్ష్మి దంపతుల మనవడు హైదరాబాద్ వాసి శిరికోటి ఉపేందర్ – రవళిక దంపతుల ద్వితీయ వివాహ వార్షికోత్సవం సందర్భంగా చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయ విద్యార్దులకు రగ్గులను పంపిణీ చేసారు. మంగళవారం స్దానిక వనవాసీ నిలయంలో జరిగిన కార్యక్రమంలో రామకృష్ణ దంపతులు విద్యార్దులకు రగ్గులను అందచేసారు. ఈ సందర్భంగా వారు విద్యార్దులను ఉద్దేసించి మాట్లాడారు. క్రమ శిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్దితికి చేరుకోవాలన్నారు. ఇక్కడి విద్యార్దుల క్రమ శిక్షణ తమను ఎంతో ఆకట్టుకున్నదని అన్నారు. వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత మాట్లాడుతూ విద్యార్దులకు రగ్గులను అందచేసిన ఉపేందర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నిలయ కమిటీ సభ్యులు గొంది శోభన్ బాబు, జవ్వాది మురళీకృష్ణ, గోగికార్ రాంలక్ష్మణ్, వేములపల్లి ప్రవీణ్ బాబు, గొంది ప్రసన్నకుమారి పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్