భద్రాచలం, నేటిసూర్య న్యూస్ : 2022లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో అర్హత పొంది హైదరాబాద్ లోని చంచలగూడ (ఎస్ఐసీఏ) శిక్షణ పొంది ప్రినన్ టెక్నాలజీలో బంగారు పతకం సాధించి భద్రాచలం జైలు వార్డెన్ గా కొరకానుల సాంబశివరావు నియామకమయ్యారు. ఈయన ఈ నెల 12న విధుల్లో చేరబోతున్నారని తెలిసింది. ఈయన తల్లి కానల్య తండ్రి భూషణంలు మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. తండ్రి పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. సాంబశివరావు డిగ్రీ చదువుతున్నప్పుడే తండ్రి మరణించారు. తండ్రి మరణించడంతో కుటుంబ భారం మొత్తం తన భుజస్కంధాలపై వేనుకొని ఒకవైపు పాల వ్యాపారం నిర్వహిస్తూ- మరో వైపు కుటుంబం బరువు బాధ్యతలన్నీ తానే మోస్తూ డిగ్రీ పూర్తి చేయడం విశేషం. ఏ విధంగానైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో కవ్వవడి 2022 కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో అర్హత సాధించి ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడం తో ఆయనకు బంగారు పతకం దక్కించుకున్నారు. ఒకటవ తరగతి నుంచి డిగ్రీ వరకు భద్రాచలంలోనే విద్యాభ్యాసం కొనసాగించారు. ఈయనకు ప్రభుత్వ ఉద్యోగం తోపాటు అందులో పోలీస్ డిపార్టుమెంట్లో మంచి పోస్ట్ దొరకడంతో ఆయన తల్లి కౌసల్యతోపాటు బంధువులు, స్నేహితులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.











