భద్రాచలం, నేటిసూర్య న్యూస్ : భద్రాచలంలో మూడు దశాబ్దాలుగా నిర్విరామంగా కొనసాగుతోన్న క్రికెట్ పోటీలివి… నెహ్రు కప్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరని… ఈ కప్ వల్ల దక్షిణ అయోధ్య అయిన శ్రీ రామ చంద్రుని దర్శనాలు కూడా జరిగిపోతాయని అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న 29వ నెహ్రూ కప్ అంతరాష్ట్ర క్రికెట్ పోటీలు ఈ నెల 26నుంచి జనవరి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నెహ్రూ వ్యవస్థాపకులు తోటమళ్ల బాలయోగి, వాతాడి దుర్గా అశోక్ లు పేర్కొన్నారు. ఈ మేరకు భద్రాచలంలో మంగళవారం జరిగిన సమావేశంలో నెహ్రూ కప్ షెడ్యూల్ విడుదల చేశారు. టోర్నమెంట్లో విజేతకు రూ.50వేలతోపాటు ట్రోఫీ, రన్నర్స్ కు రూ.30వేలతోపాటు ట్రోఫీ ఇవ్వనున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అలాగే విన్నర్స్ రన్నర్స్ తో హైటు టోర్నమెంట్లో ప్రతిభ చాటిన వారి కి బెస్ట్ బ్యాట్స్ మాన్, బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ తదితర అవార్డులు, వ్యక్తిగత బహుమతులు కూడా అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. టోర్నమెంట్ లో పాల్గొనేందుకు ఆసక్తి గల క్రికెట్ జట్లు ఈ నెల 20తేదీ లోపు తమ ఎంట్రీలను కన్వీనర్ షేక్ సలీం (అబ్జాస్ ఫుట్ వేర్ – క్రికెట్ గ్రౌండ్ ఎదురుగా భద్రాచలం, సెల్ 94401 01108) అనే చిరునామాకు పంపించగలరని కోరారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తోటమల్ల వాతాడిలు మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా నెహ్రూ కప్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సారి మాత్రం నిర్వహించే ఈ టోర్నమెంట్ కూడా ఎప్పటిలాగే అందరూ తమ అమూల్యమైన సలహాలు, సహకారం అందజేయాలని వారు కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంట్ అధ్యక్షులు అట్లూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి దాట్ల శ్రీనివాసరాజు, కన్వీనర్ షేక్ సలీం, కోశాధికాల కుంచాల సదానందం (సిద్ధు), ఉపాధ్యక్షులు గుమ్ములూరి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మడిపల్లి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు పైన పేర్కొన్న ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి తమ సందేహాలను నివృతి చేసుకోగలరని కోరారు.











