బన్సులో వురిటి నొప్పులతో మహిళ నరకయాతన

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

యథేచ్ఛగా ఇనుక తోలకాలతో ట్రాఫిక్ జామ్

పాలకులు, అధికారులు ఇష్టారాజ్యం

కాంట్రాక్టర్ల గుప్పిట్లో ర్యాంపులు

ప్రజా సంక్షేమం పట్టించుకునేదెవరు..?

చర్ల, నేటిసూర్య ప్రతినిధి :

పిల్లి గుడ్డిదైతే… ఎలుక ఎకసెక్కలాడిందటా… అన్నట్టుంది ఇక్కడి స్థితిగతులు… ప్రజా సంక్షేమాన్ని మరిచి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటే ఇదేనేమో కాబోలు… ఒకవైపు రోడ్లప్రక్కల ఇసుక లారీలు మరోవైపు అడ్డు అదువు వేయకుండానే వదిలేయడం వారి పాలనకు అద్దం పడుతోంది. బుధవారం నాడు ఓ మహిళ వురిటి నొప్పులతో బస్సులో నరకయాతన పడ్డ సంగతి సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కత్తిగూడెం గ్రామ సమీపంలో వెంకటాపురం నుంచి భద్రాచలంకు వెళ్లే బస్సులో ఒక మహిళ వురిటి నొప్పులతో బాధపడుతూ ట్రాఫిక్ జామ్ కావడంతో తీవ్రంగా ఇబ్బందుల పాలైంది. ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగానే పాలకులు, అధికారులు వ్యవహరించడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇసుక ర్యాంపు తోలకాల్లో కాంట్రాక్టర్ల కంటే అధికారులు ఎక్కువ చొరవ చూపుతున్నారని అర్థమవుతుంది. ఈ మేరకు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ చర్ల, దుమ్ముగూడెం నబ్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి నతీష్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాత పద్ధతిలోనే ఇసుక లారీలు రోడ్లపై నిలిచిపోవడంతో అనేక వాహనాలకు ప్రజలకు ఇబ్బందిగా ఏర్పడిందని ఈ విషయంలో అధికారులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా కత్తిగూడెంలో ఇదే పద్ధతిలో వాహనాలు ఆగిపోతే ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, అధికారులకు మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేసినప్పటికీ అధికారులు పాలకులు, కాంట్రాక్టర్లకే అనుమతులిస్తూ… వారి తొత్తుగా వ్యవహరిస్తున్నట్లు తేట తెల్లమైందన్నారు. ప్రజలందరూ గతంలో అనేక ఇబ్బందులు పడుతూ ఇసుక లారీలను ఈ రోడ్లపై నుంచి పోనివ్వకుండా సౌకర్యంగా రోడ్లు ఉండేటట్టు చూడాలని సూచించారు. ఎందుకంటే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో అంబులెన్స్, బస్సులు రవాణాకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలియజేస్తే నమస్యను పరిష్కరిస్తామని చెప్పి యధావిధిగా రోడ్ల మీదనే వాహనాలను పంపిస్తున్నారని మండిపడ్డారు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫలితంగా ఇనుక లారీలు రోడ్లపై అగిపోవడంతో ఉద్యోగస్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు చెప్పిందే వేదం… వారి మాటే శాసనంలా పాలకులు, అధికారులు వారి కనుసన్నల్లో నడిపించుకుంటూ వారి గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు అనేకసార్లు ప్రజాభిప్రాయాల్లో భాగంగా అధికారులకు ప్రజాప్రతినిధులకు, పాలకులకు తెలియజేశామని ఇక దశల వారీ ఆందోళన మొదలు పెడతామని రేపటి నుంచి ఇసుకల లారీలని ఇనుక కాంట్రాక్టర్లని ఇనుక దందాను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ ఆలిండియా ట్రైబల్ ఫోరం జిల్లా నాయకులు గొంది ముయ్యన్న ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్