ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ & వెల్ఫేర్ సొసైసీ నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం కొత్తగూడెంలో ఏకగ్రీవంగా జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా రత్న కుమార్ (వార్తతరంగాలు) , ప్రదాన కార్యదర్శిగా శెట్టి గోపి (టైమ్స్ పవర్ ) ,కోశాధికారిగా డొంకన చంద్రశేఖర్ (V5 ) , ఉపకోశాదికారిగా ఎస్. ఋషి కుమార్ ( నేటిసూర్య ), జాయింట్ సెక్రెటరీగా బాలకృష్ణ (95Tv), ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా జి.శ్రీనివాసరావు ( మన ప్రగతి), రంజిత్ ఆనంద్( మీ వార్త),చీఫ్ అడ్వైజర్స్ గా కె. రవీందర్ ( తెలుగు నాడు), డి. శ్రీనివాస్( డిఎస్ఆర్ హబ్), కార్యవర్గ సభ్యులుగా , ధర్మారావు, వి. నాగయ్యలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రత్న కుమార్, ప్రధాన కార్యదర్శి గోపి మాట్లాడుతూ… జిల్లాలో విలేఖర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. అలాగే విలేఖర్లకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని భరోసానిచ్చారు. ప్రెస్ క్లబ్ లో ఇన్న విలేకరుల అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని ఇంకా విలేఖర్ల కుటుంబాలకు ఉచిత వైద్య, విద్య సదుపాయాలు కలిగేలా కృషి చేస్తామని హామిని చ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్