చర్ల, నేటిసూర్య న్యూస్ : అతి పిన్న వయస్సులో తాను చదువుతోన్న స్కూల్, నివసిస్తోన్న ఊరు, జిల్లా పేర్లను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లిందా బాలిక… ఈ నెల 23న పాల్వంచలో జరిగిన సబ్ జూనియర్ అథ్లెటిక్స్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ అండర్-10 బాలికల విభాగంలో 300మీటర్ల పరుగు పందెం పోటీల్లో పాల్గొని ఔరా అనిపించుకుంది అందరి చూపు తన వైపు మళ్లించుకుందా చిన్నారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో విద్యనభ్యసిస్తోన్న విద్యార్థిని ఆత్మకూరి రుత్విక జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. అందుకుగాను వచ్చే నెలా డిసెంబర్ 1న మంచిర్యాలలో జరిగే అథ్లెటిక్స్‌లో పాల్గొంటుందని పాఠశాల యాజమాన్యం గర్వంగా చెప్పారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ రవి కుమార్, రాష్ట్ర స్థాయి స్థాయికి ఎంపికైన రుత్వికతోపాటు ఆమె తల్లిదండ్రులను రాహుల్ విద్యాలయం చైర్మన్ డాక్టర్ డీఎన్. కుమార్, డాక్టర్ ప్రతిభ, టీవీపీసీ శాస్త్రితోపాటు ప్రిన్సిపాల్ వర్మ రాజు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది అభినందనలు తెలిపారు.











