లక్ష్మీనగరం – గంగోలు బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

రూ.28లక్షల వ్యయంతో చేపట్టనున్న నిర్మాణం.

దుమ్ముగూడెం, నేటిసూర్య న్యూస్ :

ప్రజల రాకపోకలను మరింత సులభతరం చేసేందుకుగాను… ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురుచూస్తోన్న
ఆయా గ్రామాల ప్రజల నిరీక్షణకు నేటి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు శంకుస్థాపనతో ఫుల్స్టాప్ పడ్డట్టయింది. మంగళవారం నాడు దుమ్మగూడెం మండల మండల పరిధిలోని లక్ష్మీనగరం నుండి గంగోలు వరకు ఆర్ అండ్ బీ రోడ్డును వయా మండల పరిషత్ మీదుగా సుమారు రూ.28లక్షల అంచనా వ్యయంతో ఎమ్మెల్యే స్వయంగా ముఖ్య అతిథిగా హాజరై… స్థానిక అధికారులు, నాయకుల సమన్వయంతో నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దుమ్మగూడెం పంచాయతీ రాజ్ అధికారులు, సంబధిత సిబ్బంది దుమ్మగూడెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటప్పయ్య, పోలీస్ సిబ్బంది, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు
తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్