కోరగడ్డ నిర్వాసితుల కోసం మరో ఉద్యమానికి సిద్ధం. సిపిఎం మండల మహాసభ డిమాండ్ .

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

చర్లలో డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలి.

తాలుపేరు ప్రాజెక్టు అదనపు గేట్ల నిర్మాణం పూర్తి చేయాలి.

పట్టాలిచ్చిన పోడు భూములకు విద్యుత్తు, వ్యవసాయ బోరులు మంజూరు చేయాలి.

చర్ల , నేటి సూర్య న్యూస్: సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు అవుతున్న పేదల కోసం మరో సమస్యలు పోరాటానికి ప్రజలను సమాయత్తం చేస్తామని నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు సిపిఎం పోరాడుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య తెలిపారు. సిపిఎం చర్ల మండల తొమ్మిదవ మహాసభ శ్రీనివాస కళ్యాణ మండపంలో అమరజీవి సీతారాం ఏచూరి నగర్ కుంజా చిన్నక్క ప్రాంగణంలో జరిగింది. మహాసభను ప్రారంభిస్తూ అన్నవరపు కనకయ్య మాట్లాడారు. ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వేలాది మంది పేద కుటుంబాలను సీతమ్మసాగర్ లో ముంచటం అన్యాయమని వారు కోల్పోతున్న లంక భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తాలుపేరు ప్రాజెక్టు అదనపు గేట్ల నిర్మాణం మూలన పడిపోయిందని దానికోసం నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని, ప్రాజెక్టును ఆధునికరించాలని డిమాండ్ చేశారు .చర్ల మండలానికి సాగునీటి వనరులు కల్పించే వద్దిపేట చెక్ డాం నిర్మాణానికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. చర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూగోదావరిముంపు గ్రామాల ప్రజలకు మేరక ప్రాంతంలో ఇంటి స్థలాలు ఇచ్చి ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారానే నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పోరాటాల ఫలితంగానే మూడు గ్రామాలకు సంబంధించిన గోదావరి ముంపు బాధితులకు ఇళ్ల స్థలాలు వచ్చాయని, అనేక గ్రామాల్లో పోడు సమస్య పైన సిపిఎం పోరాడి విజయం సాధించిందని పేర్కొన్నారు. మండల కేంద్రంలో హాస్పటల్ సమస్య మీద సిపిఎం కృషివల్లనే డాక్టర్లు వచ్చారని తెలిపారు. మండల అభివృద్ధి కోసం సిపిఎం నిర్వహిస్తున్న పోరాటాలను బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు .రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాలను అమలు చేయాలని వ్యవసాయ కార్మికులకు ప్రకటించిన 12,500 కూలి బందు పథకాన్ని మహిళలకు ప్రకటించిన 2500 ఆర్థిక సహాయం పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలు పొందిన పోడు సాగుదారులకు త్రీఫేస్ విద్యుత్ సదుపాయాన్ని, కల్పించి వ్యవసాయ బోర్లను మంజూరు చేయాలని మండలంలో వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. చర్ల మండల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిర్వహిస్తున్న పోరాటాలకు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మహాసభ సందర్భంగా సిపిఎం కార్యాలయం నుండి శ్రీనివాస కళ్యాణ మండపం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మహాసభ ప్రారంభ సూచికంగా సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు ఎలమంచి రవికుమార్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడు సంవత్సరాల కాలంలో చనిపోయిన పార్టీ నాయకులు కార్యకర్తలకు, అభ్యుదయ వాదులకు మహాసభ సంతాపాన్ని ప్రకటిస్తూ శ్రద్ధాంజలి ఘటించింది. మహాసభకు పార్టీ మండల కమిటీ సభ్యులు కారం నరేష్ పి సమ్మక్క, అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె బ్రహ్మచారి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గడ్డం స్వామి మండల కార్యదర్శి మచ్చా రామారావు ,మండల కమిటీ సభ్యులు తాటి నాగమణి రాధాకుమారి, దొడ్డి హరినాధ వర్మ, పామర్ బాలాజీ ,బందెల చంటి పార్టీ నాయకులు నవీన్ వరలక్ష్మి ,షారోని, నాగేశ్వరరావు ,కాంతయ్య రాంబాబు, శ్యామల చంద్రం. నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్