నేటిసూర్య ప్రతినిధి:
ములుగు జిల్లాలో మావోయిస్టులు పోలీస్ ఇన్ఫర్మర్లనే నెపంతో ఇద్దరు వ్యక్తులను గొడ్డళ్లతో నరికి హతమార్చారు. వాజేడు మండలం పెనుగోలు కాలనీకి చెందిన ఉయిక రమేష్, అతని సోదరుడు అర్జున్ ను గురువారం రాత్రి గొడ్డలతో నరికి హతమా ర్చారు. మృతుల్లో ఒకరైన రమేష్ ఇదే మండలంలోని పేరూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మృతదేహాల వద్ద మావో యి స్టులు లేఖలను వదిలారు. గతంలో హెచ్చరించినప్పటికీ పద్ధతి మార్చుకోకపోవడం వల్లే ఈ ఘటనకు పాల్ప డినట్లు మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ములుగు జిల్లా, ఛత్తీస్ గడ్ సరిహద్దులో వరుస ఎన్ కౌంటర్లు జరిగిన నేపథ్యంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడినట్లుగా సంచలనం కలిగించింది.
Post Views: 132











