చర్ల , నేటిసూర్య ప్రతినిధి :
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకుంటుందని చర్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు అవుల విజయభాస్కర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రమైన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత దేశ తొలి మహిళ ప్రధాన మంత్రి, భారతరత్న ఇందిరా గాంధీ 107వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలోని పేద ప్రజల కోసం ఖానా, మకాన్ (భోజనం, ఇల్లు), వ్యవసాయ భూములను పేద వారికి పంచిన ఘనత ఆ మహాత్మురాలుకే దక్కుతుందన్నారు. బ్యాంకులను జాతీయం చేయడం వల్ల ప్రజలకు మరింత చేరువ చేశారన్నారు. నెహ్రూ నుంచి అందిపుచ్చుకున్న నాయకత్వ పటిమతో ఉక్కు మహిళగా ఇందిరా గాంధీ దేశ ప్రజలకు మేలు చేసిన ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ రైతు కాంగ్రెస్ నాయకులు ఇందల బుచ్చిబాబు, చర్ల మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కారంపూడి సాల్మన్ రాజు, తోటమల్ల వరప్రసాద్, ఇర్పా శ్రీనివాసరావు, కణితి శ్రీనివాసరావు, గుడిమెట్ల సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.











