అన్న సంతర్పణ నిర్విఘ్నంగా జరగాలి…. దాతలు సహకరిస్తేనే సాధ్యం…. చైర్మన్ నీలి ప్రకాష్ ఆకాంక్ష

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

చర్ల, నవంబర్ 17, నేటి సూర్య న్యూస్:

అన్న సంతర్పణ కార్యక్రమం నిర్విఘ్నంగా జరపడానికి మిత్రులందరూ సహకరిస్తేనే సాధ్యమవుతుందని మీ కోసం
మేమున్నాం టీం చైర్మన్ నీలి ప్రకాష్ ఆకాంక్షించారు. ఎప్పటిలాగే ఈ ఆదివారం కూడా చర్ల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద
155వ వారపు సంతలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో సుమారు 300మంది సంతకు వచ్చే పేద వారి
కోసం మహాన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా టీం చైర్మన్ మాట్లాడుతూ.. దివంగత మునగాల సీత కుమారి
సంవత్సరీకం సందర్భంగా వారి కుమారులు మునగాల కృష్ణ ప్రసాద్, సోదరులు పంపిన వితరణతో ఉచిత భోజనాలు
పెట్టారు. ఈ కార్యక్రమంలో ముమ్మనేని అరవింద్, దొడ్డి రమణారావు, కొంగూరు నర్సింహారావు, దొడ్డి సూరిబాబు, ఉ
మ్మలేటి మల్లికార్జునరావు, సొల్లంగి నాగేశ్వరరావు, వరికల శ్రీను, భద్రం, పరిశుద్ధం తదితరులు పాల్గొనగా, అలాగే
వారాంతపు అన్నదానం కార్యక్రమానికి అరటి పండ్లు వితరణగా పంపిన బళ్లారి రవి, వెజిటబుల్స్ షాప్, చర్ల వారికి
పెరుగు బకెట్ వితరణగా పంపిన చింతలపూడి రాంబాబు దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్