OICLలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి..

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) ఇంజనీర్, అకౌంటెంట్ సహా అనేక పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 21 మార్చి 2024 నుండి ప్రారంభమయ్యాయి.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు 12 ఏప్రిల్ 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ orientalinsurance.org.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ జారీ చేసిన ప్రకారం అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించవలసి ఉంటుంది.

మొత్తం 100 ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి కంపెనీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టుల్లో అకౌంటెంట్ 20, ఇంజినీరింగ్ (ఐటీ) 20, మెడికల్ ఆఫీసర్ 20, ఇంజినీరింగ్ 15, ఇతర పోస్టులు ఉన్నాయి.

విద్యార్హత..

అకౌంట్స్ పోస్ట్ కోసం, అభ్యర్థి వాణిజ్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి, లేదా MBA డిగ్రీని కలిగి ఉండాలి. ఇంజనీరింగ్ (IT) పోస్ట్ కోసం, అభ్యర్థి కంప్యూటర్ సైన్స్‌లో M.Tech లేదా MCA డిగ్రీని కలిగి ఉండాలి. మెడికల్ ఆఫీసర్ పోస్టులకు, అభ్యర్థి MBBS డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి..

దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 31 డిసెంబర్ 2023 నాటికి 21 సంవత్సరాల కంటే తక్కువ, 30 సంవత్సరాలకు మించి ఉండకూడదు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఇచ్చారు.

దరఖాస్తు రుసుము..

జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ 1000 చెల్లించాలి. అయితే షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) మరియు వికలాంగ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 250 దరఖాస్తు రుసుము చెల్లించాలి.

ఎలా దరఖాస్తు చేయాలి

orientalinsurance.org.in కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

హోమ్ పేజీలో ఇచ్చిన కెరీర్ ట్యాబ్‌ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు ఇక్కడ స్కేల్ I ఖాళీకి దరఖాస్తు చేయడానికి లింక్‌ పై క్లిక్ చేయండి.

నమోదు చేసి దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక జరిగే విధానం ?

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఈ వివిధ పోస్టులకు ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. మొత్తం 100 మార్కుల ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష నమూనాను కంపెనీ విడుదల చేసింది.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్