చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా.?

Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో ఒకటి. ప్రతీరోజూ కోట్లాది మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది ఇండియన్‌ రైల్వే.

లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తూ దేశంలో ఎక్కువ అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థగా కూడా ఇండియన్‌ రైల్వేకు పేరుంది. అయితే ఇన్ని విశేషాలు ఉన్న భారతీయ రైల్వే ఎన్నో వింతలకు కూడా నెలవుగా ఉంటుంది.

తాజాగా ఇలాంటి ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. హోలీ పర్వదినానికి ముందు రోజు జరిగిన ఈ సంఘటన అందరి దృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ముంబై-వారణాసి కామయాని ఎక్స్‌ప్రెస్‌లో ఓ గర్భిణీ మహిళ ప్రయాణం చేసింది. అయితే ఇదే సమయంలో పురిటి నొప్పులు రావడంతో కదులుతోన్న రైలులోనే ఆ మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సదరు మహిళ తన భర్తతో కలిసి మహారాష్ట్రలోని నాసిక్ నుంచి మధ్యప్రదేశ్‌లోని సత్నాకు రైలులో బయలుదేరి వెళ్లారు.

అయితే అదే సమయంలో మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. దీంతో అదే కోచ్‌లో ఉన్న ఇద్దరు మహిళా ప్రయాణికులు సాయంగా నిలిచారు. రైల్వే అధికారులకు వెంటనే సమాచారం అందించగా ఆర్‌పీఎప్‌ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో వెంటనే రైలును విదిషా రైల్వే స్టేషన్‌లో ఆపి డెలివరీ చేశారు. ఆ మహిళ పండంటి ఆడ బిడ్డకు జన్మనివ్వగా. ఆ చిన్నారికి కుటుంబ సభ్యులు కామయని అని నామకరణం చేయడం విశేషం. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్