వాట్సాప్‌ కాలింగ్‌ ఫీచర్‌ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్‌డేట్‌ మీకోసమే..!!

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ (Whatsapp New Update) గత కొన్ని నెలలుగా అనేక ఫీచర్ల లాంచ్‌ తోపాటు ప్లాట్‌ఫాం ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

వినియోగదారుల సౌకర్యం, భద్రత కోసం ఇటీవల కాలంలో అనేక ఫీచర్లను విడుదల చేసింది. ఇటీవల వాట్సాప్‌ నావిగేషన్‌ ప్యానల్‌లోనూ మార్పులు చేసింది.

తాజాగా వాట్సాప్‌ కాలింగ్‌ ఇంటర్‌ఫేస్‌ను (Whatsapp Calling UI) మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త కాలింగ్‌ ఇంటర్‌ఫేస్‌ యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

వాట్సాప్‌ బీటా ఆండ్రాయిడ్‌ 2.24.7.19 వెర్షన్‌లో అందుబాటులో ఉంది. త్వరలో ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ ఫీచర్ ట్రాకర్‌ WaBetainfo ఈ వివరాలను వెల్లడించింది. వాట్సాప్‌ కాలింగ్‌ ఇంటర్‌ఫేస్‌లో కొత్తగా మినిమైజ్‌ బటన్‌ను తీసుకురానున్నట్లు తెలిసింది. ఫలితంగా వాట్సాప్‌ కాలింగ్ ఇంటర్‌ఫేస్‌ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిపింది.

వాట్సాప్ కాలింగ్‌ సమయంలో ప్రస్తుతం ఉన్న ఆందోళనకు చెక్‌ పెడుతుందని తెలుస్తోంది. వాట్సాప్‌ కాల్‌ సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మినిమైజ్‌ బటన్‌ ఉపయోగపడనుంది. ఫలితంగా ఇంటర్‌ఫేస్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో కాలింగ్‌ మరింత సౌకర్యంగా ఉంటుందని తెలుస్తోంది.

* దీంతోపాటు వాట్సాప్‌ స్టేటస్‌ బార్‌లోనూ భారీ మార్పులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ WAbetainfo ఆధారంగా యూజర్లకు మరింత మెరుగైన అనుభూతిని ఇచ్చేందుకు మరిన్ని టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.24.7.16 లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉందని తెలిపింది. ఈ వెర్షన్‌లో వాట్సాప్‌ స్టేటస్‌ కొత్త ఇంటర్‌ఫేస్‌ను గుర్తించవచ్చు.

వాట్సాప్‌ ఫీచర్‌ ట్రాకర్‌ ఆధారంగా స్టేటస్‌ డిజైన్‌లో వేర్వేరు మీడియా ఫార్మాట్‌లకు సులభంగా మారవచ్చు. ప్రస్తుతం స్టేటస్‌ బార్‌ వాట్సాప్‌ దిగువన ఉంది. అందులో టెక్ట్స్‌, వీడియో, ఫోటోలను వేర్వేరుగా సెలక్ట్‌ చేసుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం నేరుగా వాట్సాప్‌ స్టేటస్‌ బార్ నుంచి మీడియాను సెలక్ట్‌ చేసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో రానున్న అప్‌డేట్‌లలో విడుదల చేసే అవకాశం ఉంది.

** వాట్సాప్‌ ఇటీవల మరో ఫీచర్‌పైన పనిచేస్తోందని ఫీచర్‌ ట్రాకర్‌ వెల్లడించింది. జనరేటివ్ AI ఫీచర్‌ ద్వారా ఫోటోలను ఎడిట్‌ చేసుకొనే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ ద్వారా ఇమేజ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ను మార్పులు చేసేందుకు, రిస్టైల్‌ చేయడం సహా ఇతర మార్పులు చేయవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ 2.24.7.13 వెర్షన్‌లో ఈ ఏఐ ఆధారిత ఇమేజ్‌ ఎడిటర్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది. సాధారణంగా ఫోటోలను ఇతరులకు షేర్‌ చేసేటప్పుడు అధిక నాణ్యత కలిగిన ఫోటోలుగా పంపేందుకు HD ఆప్షన్‌ను ఎంచుకుంటాం. ప్రస్తుత ఫీచర్ ఆ HD బటన్‌ ఎడమవైపున ఉండనుంది. గ్రీన్‌ రంగు బటన్‌ను కలిగి ఉంటుంది. దీనిపై క్లిక్‌ చేయగానే బ్యాక్‌డ్రాప్‌, రీస్టైల్‌, Expand వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్