రోడ్లపై ధాన్యాన్ని పోసి నల్ల పరదాలు కప్పడం వల్ల ధాన్యం కుప్పలు కనపడక ధాన్యము కుప్పకు ఢీకొని ప్రయాణికులు ప్రమాదాలకు గురైన సంఘటనలు చాలా ఉన్నాయని,రోడ్లపై ఎవరు కూడా ధాన్యాన్ని కుప్పలు పోయవద్దని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఎస్ఐ బండి రాజేష్ తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రోడ్లపై ధాన్యాన్ని పోయవద్దని ఎస్సై రైతులను కోరారు.రోడ్లపై ధాన్యం పోయడం వల్ల వాహనదారులు మోటార్ సైకిల్ వాహనదారులు రాత్రి సమయాలలో అది గమనించక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. వ్యవసాయ పొలాల వద్ద,ఇండ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాలలో ధాన్యం పోయడానికి ఏర్పాటు చేసుకోవాలని,నిర్లక్ష్యంగా రోడ్లపై ధాన్యం పోసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కావొద్దు ఎస్సై హెచ్చరించారు.రోడ్లపై ధాన్యం పోసి రాత్రి సమయంలో నల్ల కవర్ కప్పి చుట్టూ రాళ్లు పెట్టడం వల్ల అది గమనించని మోటార్ సైకిల్ వాహనదారులు ధాన్యం కుప్పకు తగిలి ప్రమాదలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్లపై ధాన్యం పోయవద్దని రైతులకు సూచిస్తున్నట్లు తెలిపారు.ఎవరైనా ధాన్యాన్ని రోడ్లపై నిర్లక్ష్యంగా పోస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.రోడ్డు ప్రమాదాల నివారణ గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై వివరించారు.











