రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పరిసర గ్రామాల నుండి పోటీ పరీక్షల కోసం సిరిసిల్లకు వెళ్లవలసి వస్తుందని పోటీ పరీక్షల కోసం నిత్యం అభ్యసన చేయడానికి వేములవాడ పరిసర గ్రామాల నుండి సిరిసిల్లకు వెళ్తున్నామని వేములవాడలో ఇటీవల నిర్మాణం చేసిన నూతన గ్రంథాలయాన్ని వెంటనే ప్రారంభించాలని పలువురు నిరుద్యోగ యువతీ యువకులు కోరుతున్నారు. ప్రతిరోజు 300 నుండి 400 మంది నిరుద్యోగులు సిరిసిల్ల గ్రంధాలయానికి వెళ్లి చదువుతున్నట్లు తెలిసింది. వేములవాడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇటీవల నిర్మితమైన నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభిస్తే తమకు చదువుకునేందుకు కాస్త సౌకర్యంగా ఉంటుందని పలువురు అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం నూతన గ్రంథాలయ భవన ఆవరణలో తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చొరవ తీసుకొని నిరుద్యోగులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు నూతన గ్రంధాలయ భవనాన్ని ప్రారంభించి అందులో పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.











